గుంటూరులో ఆ వైసీపీ ఎమ్మెల్యే టాప్‌లో ఉన్నారా?
అలా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునే ఎమ్మెల్యేల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల్లో ఈయనే టాప్‌లో ఉన్నారని, ప్రజల మద్ధతు పిన్నెల్లికి ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా మాచర్లలో విజయం సాధిస్తూ వస్తున్న పిన్నెల్లికి టీడీపీ చెక్ పెట్టలేకపోతుంది. పైగా ఇప్పుడు అధికార ఎమ్మెల్యేగా పిన్నెల్లి దూకుడు కనబరుస్తున్నారు. ఈయనకు మాచర్లలో ప్రజల మద్ధతు చాలా ఎక్కువగా ఉంది.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా మాచర్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి పిన్నెల్లి ఇమేజ్ కారణమని చెప్పొచ్చు. అందుకే గుంటూరులో ఉన్న ఎమ్మెల్యేల్లో పిన్నెల్లినే టాప్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక కొందరు ఎమ్మెల్యేలు కూడా పర్వాలేదనిపిస్తున్నారు. బాపట్లలో కోన రఘుపతి, నరసారావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాలలో కాసు మహేష్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలకు సైతం మంచి మార్కులే పడుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇటీవల వచ్చిన ఓ సర్వేలో చిలకలూరిపేటలో రజిని, తాడికొండలో శ్రీదేవి, వేమూరులో మేరుగు నాగార్జున, గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరి లాంటి ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అటు మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గుంటూరు ఈస్ట్‌లో ముస్తఫా, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో నంబూరి శంకర్ రావు, పొన్నూరులో రోశయ్య లాంటి ఎమ్మెల్యేలకు ఎవరేజ్ మార్కులు పడుతున్నట్లు తెలుస్తోంది.