బస్సు బోల్తా.. పదిమందికి గాయాలు.. ఎక్కడంటే..?
వధువు ఆటోలో ముందు కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం కాలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనతో వధువు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
తెలంగాణలోనూ బుధవారం తెల్లవారు జామునే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని ఆకుపాముల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో బస్సులో 33 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వారిలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.