జగన్ బెయిలు రద్దు కాకపోతే 'టీడీపీ' రియాక్షన్ ఇదే ?
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని కొందరు నాయకులు సైతం ఈ రోజు కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజున వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన జగన్ బెయిలు రద్దు పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. దీనిపై నిన్నటి నుండే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ బెయిలు రద్దవుతుందా ? బెయిలు కంటిన్యూ అవుతుందా ? ఈ రెండు ప్రశ్నల మధ్య జనాలంతా ఊగిసలాడుతున్నారు. ఒకవేళ బెయిలు కనుక రద్దయితే ఇది చరిత్రలో మిగిలి పోనుంది. అలా కాకుండా బెయిలు కంటిన్యూ అయితే ఏ విధమైన చర్చలు తెరమీదకు వస్తాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిలు కనుక రద్దు కానట్లయితే...? ప్రతి పక్ష టీడీపీ ఏ విధంగా తన స్పందనను తెలియచేస్తుందో పలు రకాలుగా ప్రచారంలో ఉన్నాయి.
ఎప్పుడూ జగన్ బీజేపీ తో సాన్నిహిత్యంగా ఉంటాడు కాబట్టి. రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి పెద్దగా కూడఁరాన్ని ప్రశ్నించాడు కాబట్టి.. ఈ కోణంలో టీడీపీ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ తన స్వార్థం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని బెయిలు రద్దును ఆపించగలిగాడు అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు జగన్ పీడ విరగడవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్న 'చంద్రబాబు అండ్ కో' కి ఇలా జరగడం మింగుడు పడని విషయం. అందుకే బీజేపీ వైసీపీకి మధ్యన ఉన్న సంబంధాలను తెరపైకి తీసుకొస్తారు. ఇక ఈ మధ్యనే బుస్ బుస్ అని లేస్తున్న చంద్రబాబు ముద్దుల తనయుడు నారా లోకేష్ అయితే ఒక మీడియా సమావేశం నిర్వహించి బాబోరు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పొల్లు పోకుండా చెబుతారు.