గెలిచేది జగన్ : తెలుగు తమ్ముళ్లు ఏమయిపోతారో!
లేదా అన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది
ఒకవేళ జగన్ బెయిల్ రద్దు కాకపోతే
ఏమయిపోతారు వీరంతా?
కోర్టుకు విరుద్ధంగా మాట్లాడతారా?
లేదా సీబీఐ కోర్టుకు ఉద్దేశాలు ఏమయినా ఆపాదిస్తారా?
గెలిచేది జగన్ .. పోనీ గెలిపించేది రఘురామ..ఆయనను వెనుక ఉండి నడిపించేది చంద్రబాబు..లేదా ఆయన మనుషులు. ఎందు కు వచ్చిన గొడవ. రఘురామ అడిగిన సాయం జగన్ చేసి ఉంటే బాగుండేది. ఆయన పవర్ ప్లాంట్లను ఒడ్డెక్కిస్తే ఈ పిటిషన్ అన్నదే దాఖలు అయి ఉండేదే కాదు. కానీ జగన్ అలా చేయరు. చేయలేరు కూడా! ఎందుకంటే జగన్ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. ఆయ న బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు ఓటేయ్యరు. తన దగ్గర ఉన్నవారే వెళ్లిపోతామంటే వెళ్లాలనుకుంటే వెళ్లండి బెదిరింపు రాజకీయాలకు లొంగేదే లేదు అని గతంలోనూ ఇప్పుడూ చెప్పేమాటే ఇది. కొన్ని విషయాల్లో రాజశేఖర్ రెడ్డి కన్నా కటువుగా ఉండే జగన్ రఘురా మను కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నారు. ఈ విషయంలో గోదావరి క్షత్రియులు అంతా ఏకమై జగన్ పై యుద్ధం ప్రకటించినా కూడా జగన్ పట్టించుకోలేదు. ఎదురు నిలిచారు. తన వారితో ఏం చెప్పించాలో అదే చెప్పించారు.
బెయిల్ రద్దవ్వకపోతే జగన్ తో పాటు ఇంకొందరి వ్యూహాలు ఎలా ఉంటాయి. రఘురామ పై చేసిన ఆరోపణల యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుంది అన్నది కూడా కీ లకం. ఆయనపై మొన్నటి వర్షాకాల సమావేశాల్లో అనర్హత వేటు వేయించాలని సాయిరెడ్డి ప్రయ త్నించినా కొన్ని కారణాల రీత్యా అది జరగలేదు. అసలు ఆ తరహా ఆలోచన చేసేందుకు పార్లమెంట్ లో నెలకొన్న పరిణామాల రీ త్యా స్పీకర్ ఏ నిర్ణయమూ వెలువ రించకుండానే స్తబ్దుగా ఉండిపోయారు. బీజేపీ కూడా పెద్దగా ఈ విషయమై రియాక్ట్ కాలేదు. అం టే రఘురామను అడ్డు పెట్టుకుని టీడీపీ కానీ బీజేపీ కానీ చేస్తున్న రాజకీయం అన్నది ఓ బహిరంగ రహస్యమే కదా! ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సోషల్ మీడియా వేదికగా జగన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా అందుకు ప్రతిగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
అందుకే న్యాయ స్థానాలు ఏం చెప్పినా మీరు నోరు జారొద్దు అని తెలుగుదేశం నాయకులు ఒకరికొకరు జాగ్ర్తత్తలు చెప్పుకుంటు న్నారు. చంద్రబాబు స్థాయిలో చేసే వ్యాఖ్యలు కావాలంటే హైలెట్ చేయొచ్చు ఏమో కానీ మీడియా దీనిపై ఇంతకుమించి ఏమీ మాట్లాడలేదు. కోర్టులకు ఉద్దేశాలు ఆపాదించడం తగని పని. కనుక ఏం జరిగినా తెలుగు తమ్ముళ్లు సంయమనంతోనే ఉండాలి. లేదంటే కోర్టు ధిక్కరణ నేరం ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుంది. బెయిల్ రద్దవ్వక పోతే టీడీపీ చెప్పే మాటలకు, రఘు రామ చెప్పే మా టలు ఇప్పుడున్న విలువ ఇకపై ఉండదు గాక ఉండదు.