చంద్రబాబుని దాటిన చెవిరెడ్డి...ఆ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదా!

M N Amaleswara rao
ఏపీలో అధికార వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో చిత్తూరు కూడా ఒకటి. పేరుకు చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత జిల్లా గాని, ఇక్కడ వైసీపీదే పైచేయి...గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 13 చోట్ల గెలిచి సత్తా చాటింది. టీడీపీ కేవలం ఒకచోట గెలిచింది...అది కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు.

అయితే రెండేళ్లలో జిల్లాలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం, మరో వైపు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉండటంతో జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో కూడా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని తెలిసింది.

ఇక తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు....ఓ సంచలన సర్వే వివరాలని బయటపెట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు కూడా రావని రఘురామ తేల్చిచెప్పారు. అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు గురించి కూడా ఆసక్తికర సర్వేని బయటపెట్టారు. ప్రజల మద్ధతు ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల్లో....చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి టాప్‌లో ఉన్నారని చెప్పారు. అలాగే కుప్పంలో చంద్రబాబు ఆ తర్వాత స్థానంలో ఉన్నారని వివరించారు.

ఇక ఈ ఇద్దరు తరువాత ప్రజల మద్ధతు ఉన్నవారిలో పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. నెక్స్ట్ పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి సైతం తంబళ్ళపల్లెలో స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఈ నలుగురికే ప్రజల మద్ధతు ఎక్కువగా ఉందని, వీరికే గెలిచే అవకాశాలున్నాయని, మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల మద్ధతు తక్కువగా ఉందని, వారు ఓటమి అంచున ఉన్నారని చెప్పారు. మరి రఘురామ సర్వే ఏ మేరకు నిజమవుతుందో నెక్స్ట్ ఎన్నికల్లో తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: