తన తండ్రి దివంగత రాజకీయ నాయకుడు మరియు మాజీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన పరిస్థితులన్నీ తెలిసినవే. ఆ తర్వాత జగన్ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ తరపున అండగా ఉండి...పాదయాత్రలు చేసి షర్మిల ప్రజలకు బాగా చేరువైంది. 2014 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ప్రజల అభిమానాన్ని పొందగలిగారు. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ చేసిన అవినీతి అన్యాయాలపై వారి తీరును అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరపున ప్రశ్నించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఆ నమ్మకమే తనను 2019 లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీని తీసుకొచ్చింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు జగన్ కు షర్మిల రాఖీ కట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కానీ ఇది దాదాపుగా అసాద్యమేనని తెలుస్తోంది. ఈ రోజు ఉదయమే షర్మిల జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని తెలిపింది. ఈ సందేశంలో జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు అని తెలిపింది. దీనిని బట్టి ఈ సారి రాఖీ కట్టే ఆలోచనే లేనట్టు స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న ప్రకారం దీనికి ప్రధాన కారణం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో ఒక వైఎస్సార్ బిడ్డగా సొంత అన్నకు వ్యతిరేకంగా మాట్లాడడమే కారణం అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే షర్మిల మాట్లాడిన మాటలే...జగన్ కోపం రావడానికి కారణమా ? అని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అప్పుడు షర్మిల మాట్లాడుతూ, తెలంగాణకు సంబంధించి ఒక చుక్క నీరు కూడా ఏపీకి ఇచ్చేది లేదని పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
షర్మిల కు సంబంధించి ఇరు రాష్ట్రాలు ముఖ్యమైనవే...అలాంటి సమయంలో సమస్యను పరిష్కరించే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా తన వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేదని వైయస్సార్ తో అనుబంధమున్న ప్రతి ఒక్కరూ అనుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన మనస్పర్థలను ఈ రాఖీ శుభ దినమున తొలగించుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి ఇంకా సాయంత్రం వరకు సమయం ఉన్నందున ఏమి జరగనుంది అని చూడాలి. అసలు జగన్ కి షర్మిల రాఖీ కడుతుందా అన్నా ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది.