బాబోరి రేవంత్: పార్టీ మారినా తీరు మారలేదుగా ?

VAMSI
రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినా ఇప్పటికీ రేవంత్ లో పాత అలవాట్లు పోవడం లేదన్నది పొలిటికల్ వర్గాల టాక్. మామూలుగా రేవంత్ రెడ్డి 2006 లో తన రాజకీయ ప్రస్థానాన్ని జెడ్పీటీసీ గా విజయం సాధించడంతో మొదలు పెట్టారు. ఆ తర్వాత 2007 లో ఇండిపెండెంట్ గా పోటీచేసి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యాడు. ఈ విజయం ఆయనను టీడీపీ కి దగ్గర చేసింది. టిడిపి నుండి 2009 లో కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. దానితో టీడీపీలో చంద్రబాబు కు మరింత దగ్గరయ్యాడు. బాబోరు ఏమి చెప్పినా శిరసా వహించేవాడు. 2015 వ సంవత్సరంలో రేవంత్ రెడ్డి మరియు బాబోరి కి సంబంధించిన ఒక సంఘటన సంచలనం రేపింది. "ఓటుకు నోటు" అనే మీటింగ్ ఒక్కసారిగా రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. దీనికి సంబందించిన ఆడియో మరియు వీడియో అప్పట్లో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. 


ఇందులో చంద్రబాబు నాయుడు స్టీపెన్ సన్ అనే వ్యక్తితో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.  అలాగే రేవంత్ రెడ్డి ఆ వ్యక్తికి 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ వివాదం తర్వాత 2017 లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ టీడీపీని వీడినా చంద్రబాబు పై విశ్వాసం పోలేదని తెలుస్తోంది. మామూలుగా ఎవరైనా పార్టీ మారే ముందు ఉన్న పార్టీ గురించి విమర్శలు చేయడం పరిపాటి. అలాగే పార్టీ అధ్యక్షుడిని సైతం తిడుతూ ఉండడం తరచూ చూస్తున్నాము. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటివి మీ చేయలేదు. గౌరవంగా వెళ్లి చంద్రబాబును కలిసి పార్టీని వదిలి వెళ్లాల్సిన కారణాలను వివరించారు. ఇప్పటికే కూడా బాబోరి పై చిన్న విమర్శ కూడా చేయకపోవడం ఆయన విశ్వాసానికి నిదర్శనం అని చెప్పాలి. కానీ గతంలో వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు అని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ వేసే ప్రతి అడుగులోనూ చంద్రబాబు పాత్ర ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.


ఈ విధంగా రేవంత్ రెడీ పార్టీ మారినా టిడిపిపై అభిమానం తగ్గలేదని తెలుస్తోంది. కానీ ఎంత విశ్వాసం ఉన్నా ఏమి లాభం తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. టీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ సైతం ఇటీవలే తెరాసలో చేరడంతో బాబోరికి షాకింగ్ గా మారింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి పరోక్షంగా తెలంగాణలో టీడీపీ అభివృద్ది చెందడానికి సహాయపడతారా ? లేదా టీ టీడీపీని కాంగ్రెస్ లో మిత్రపక్షం గా కలుపుకుపోతారా అన్నది వేచి చూడక అవసరం ఉన్నది. చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి ల మధ్య అనుబంధం ఎవ్వరూ విడదీయలేనిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: