మే 28న విడుదల కానున్న శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘త్రికాల’

Reddy P Rajasekhar

▪️ సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్
▪️ హై క్వాలిటీ VFX, గ్రాండ్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
▪️ ట్రైలర్‌, పాటలకు భారీ స్పందన.. పెరిగిన అంచనాలు
▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్
▪️ సినిమాకు హైలైట్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం  

భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

హైఎండ్ VFX, అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా “అమ్మ” పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధాదాస్ కొత్త లుక్‌, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ‘త్రికాల’ టైటిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…
“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ…
“మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.  

ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘త్రికాల’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Trikala movie Trailer : https://youtu.be/U098Oyg8nYo?si=bW9YTbuj4HhGK1u-

నటీనటులు:
శ్రద్ధాదాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు.

సాంకేతిక విభాగం:
సమర్పణ & విడుదల: చాగంటి ప్రొడక్షన్ LLP
నిర్మాతలు: రాధిక–శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి
డీవోపీ: పవన్ చెన్న
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: