కేసీఆర్ హుజరాబాద్ సభతో...ఈటలకు షాక్ తప్పదా?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా వాడివేడిగా సాగుతోంది. ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలోని అన్ని పార్టీలు.... హుజురాబాద్ ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ... తమ అభ్యర్థిని కూడా  ప్రకటించేసింది. అంతేకాదు హుజరాబాద్ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురవేయాలని.... ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దళిత బందు పథకాన్ని హుజరాబాద్ నియోజకవర్గం లో ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. 

అనంతరం ఆయన హుజరాబాద్ అభివృద్ధి... ఇతర రాజకీయ అంశాలను ప్రసంగించే అవకాశం కూడా ఉంది. అలాగే ఇవాల్టి సభలో హుజురాబాద్ నియోజక వర్గానికి వరాలను కురిపించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యూహం అనుసరించే ఆలోచనలో గులాబీ బాస్ కెసిఆర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే సీఎం కేసీఆర్ సభ.. కారణంగా ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే... సీఎం కేసీఆర్... ఇచ్చే ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రతిపక్ష పార్టీ ల వైపున ఉన్న ఓటర్లను సైతం... ఆయన మాట చాతుర్యానికి పడిపోవాల్సిందే. దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక.

ఆ నియోజకవర్గంలో రెండు సార్లు బహిరంగ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్.... అవలీలగా టిఆర్ఎస్ పార్టీ ని గెలిపించారు. అదే తరహాలో హుజురాబాద్ లోనూ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభతో టీఆర్ఎస్ పార్టీకి చాలా మేరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మరోసారి హుజరాబాద్ నియోజకవర్గం లో బహిరంగ సభ నిర్వహించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సీఎం కేసీఆర్ ఎత్తుగడలకు ఈటల రాజేందర్ చిత్తు కావాల్సిందేనని.... రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి సీఎం కేసీఆర్ బహిరంగ సభ టిఆర్ఎస్ పార్టీ కి ఈ మేరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: