భారత్ కు మద్దతుగా ఇరాక్.. చైనా కు షాక్?

praveen
ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య ఎంతో స్నేహపూర్వక బంధం కొనసాగుతుంది అన్నది తెలిసిందే. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ బంధాన్ని కొనసాగిస్తుంది భారత్. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు భారత్ ఎన్నోసార్లు నిధులు కూడా ఇచ్చింది. అంతేకాదు కొన్నిసార్లు ఎన్నో పాఠశాలలు కూడా నిర్మించింది భారత్.  ఇలా అప్పుగా కాకుండా సహాయంగా ఆఫ్ఘనిస్తాన్ కు అండదండగా నిలబడుతూ వచ్చింది.  కానీ అలాంటి భారత్ ను మాత్రం ఇక ఇప్పుడు అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా దేశాల పక్కన పెడుతూ వస్తున్నాయి.  ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లను తీవ్రస్థాయిలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నారు.

 ఆఫ్ఘనిస్థాన్లో మొన్నటి వరకు ఉన్న అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ల అరాచకంకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇప్పడికే దేశంలోని ఎన్నో ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు.  ఈ క్రమంలోనే ఇక ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు అటు అమెరికా చైనా రష్యా దేశాలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాయి. అయితే ఈ చర్చలకు అటు భారత్ను మాత్రం దూరం పెడుతూ వస్తున్నాయి ఈ మూడు దేశాలు. ఆఫ్ఘనిస్తాన్  కి భారత్ కి మధ్య ఎంతో బంధం ఉందని ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ ఎంతో చేసింది అని తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ఈ మూడు దేశాలు భారత్ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే భారత్ కూడా తమ మద్దతును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భారత్ రష్యా చైనా దేశాలు అటు ఇరాక్ ని కూడా పక్కన పెడుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాక్ తో కలిసి భారత్  ఆఫ్ఘనిస్థాన్  సమస్యపై చర్చించేందుకు సిద్ధం అయింది.  ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇరాక్ ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు. ఇటీవల కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకరం చేశారు. ఈ క్రమంలోనే  జయశంకర్ ఇరాక్ ఈ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జయశంకర్ ఇరాక్ కు వెళ్ళిన కొన్ని రోజుల్లోనే భారత్ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సమస్య పరిష్కరించలేము అంటూ ఇరాక్ అధ్యక్షుడు ప్రకటన చేయడం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇలా ఇరాక్ భారత్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: