ఈటెలపై కోపం.. రఘునందన్ ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్?

praveen
ప్రస్తుతం ఈటెల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్ గా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హడావిడి మొదలు పెట్టేసింది. ఇప్పటికే ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల పథకాలను హామీలను కురిపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే ఇక టిఆర్ఎస్ కంచుకోట లాంటి దుబ్బాకలో పట్టు కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ ఇక ఈ సారి హుజురాబాద్ లో కూడా ఓటమి పాలైతే పూర్తిగా పరువు పోగొట్టుకునే అవకాశం ఉంది.



 అందుకే ఏకంగా కెసిఆర్ దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇచ్చేందుకు కూడా వెనకాడలేదు. ఈటెల రాజీనామా ముందు వరకు కూడా అసలు దళిత బంధు అనే పథకాన్ని కూడా మీదికి తీసుకురాని కేసీఆర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకు రావడం సంచలనం గా మారిపోయింది. ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల అయ్యే సరికి కెసిఆర్ ఇంకెన్ని పథకాలను అమలులోకి తీసుకు వస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే..  ప్రస్తుతం ఈటెల పాదయాత్ర చేస్తూ ఉండగా అటు కేసీఆర్ మాత్రం నిధులు హామీలు అంటూ వరాలు కురిపిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.



 ఈ క్రమంలోనే అటు ఈటెల బీజేపీలో చేరడం తమకు ఎంతో బాధ కలిగించింది అంటూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకు వచ్చే విధంగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు.  అదే సమయంలో ఇక ఇప్పుడు ఈటెలకు పాదయాత్రలో మద్దతుగా నిలబడుతూ ఆయన వెంట నడుస్తున్న బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావును టిఆర్ఎస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.  ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బిజెపి లో ఉన్న రఘునందన్ రావు ఈటెల పై చేసిన విమర్శలకు  సంబంధించిన వీడియోలు తెర మీదికి తెస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తుంది టిఆర్ఎస్ పార్టీ.  ఇలా ఒకప్పుడు ఈటెలను తప్పు అని చెప్పిన వ్యక్తి ఇక ఇప్పుడు పక్కన చేర్చుకున్నాడు అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసి వ్యతిరేకత తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: