ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.!
అయినా సరే జిల్లాలో వైసీపీ ఆధిక్యం తగ్గలేదు. 2019 ఎన్నికల్లో జిల్లాలో మళ్ళీ వైసీపీనే సత్తా చాటింది. 12 సీట్లలో వైసీపీ 8 గెలిస్తే, టీడీపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేల కూడా మంచి పనితీరు కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకిత పెద్దగా రాలేదని తెలుస్తోంది.
ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం వచ్చిన విశ్లేషణలని చూస్తే ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరించడంలో ముందు ఉన్నారని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
అలా టీడీపీ నేతలు కూడా పుంజుకోలేకపోవడం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుంది. ఇదే సమయంలో జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు కాస్త నెగిటివ్ ఉందని చెబుతున్నారు. అధికారంలో లేకపోవడం, నిధులు పెద్దగా అందకపోవడం, అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు బలపడటం వల్ల టీడీపీ ఎమ్మెల్యేలకు కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం కాస్త సేఫ్ సైడ్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి రానున్న మూడేళ్లలో కూడా ఇలాగే కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.