ఫతేనగర్ లో జల మండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న నీటి శుద్ధి కేంద్రాన్ని ఇవాళ శంకుస్థాపన చేసారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరం అభివృద్ధి చెందనంత వేగంగా హైదరాబాద్ అభవృద్ధి చెందుతోందని.. నగరానికి భారీగా వలసలు వస్తున్నారు... వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
నగరంలో రోజుకు 1950 (MLD) మిలియన్ లీటర్ పర్ డే ఉత్పత్తి అవుతుందని.. 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా ముసిలోకి వెళుతోందని పేర్కొన్నారు. మురికి నీరు మంచి నేరుగా మార్చి బయటకు వదులు తున్నామని.. మురుగు నీరు శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నగరంలోని 40 శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్నామని.. విశ్వనగరానికి ఇది ఒక మొదటి అంకం గా చెప్పుకోవచ్చని.. ఈ 17 మురుగు నీటి శుద్ధి కేంద్రాల్లో 376.5 MLD శుద్ధి చేస్తామని వెల్లడించారు.
దీంతో నగరంలో మొత్తం 60 శాతం వరకు నీరు శుద్ధి చేరుతోందని.. ఫతేనగర్ నాల పైనే కడుతున్నామని పేర్కొన్నారు. దీంతో చెరువుల్లోకి మురుగు నీరు వెళ్లకుండా ఉంటుందని.. తద్వారా చెరువులు అభివృద్ధి మరియు సుందరీకరణ చేయవచ్చన్నారు. ముసిని సుందరికరించాలంటే మూసిలోకి వెళ్లే మురుగు నీటిని శుద్ధి చేయాలని పేర్కొన్నారు. మిగతా మురుగు నీటిని దశల వారిగా శుద్ధి చేస్తామని.. మన పిల్లలకు ఇంకా మెరుగైన హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. నాలల్లో చెత్తను వేయోద్దని ప్రజలను కోరారు మంత్రి కేటీఆర్. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఒక ఉద్యమం లాగా ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందన్నారు. మన దగ్గర ఉన్న పథకాలు 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా ? అని ప్రశ్నించారు.