ఫైట్ ఫర్ రైట్ : ఆ ఒక్క ఉద్యమం అణిచి వేస్తే...

RATNA KISHORE
ఫైట్ ఫర్ రైట్ : ఆ ఒక్క ఉద్యమం అణిచి వేస్తే...


తాగేందుకు నీళ్లివ్వకండి వీళ్లకు
తినేందుకు బువ్వ ఇవ్వకండి వీళ్లకు
గదులు ఎందుకు ఇక్కడ మీరెందుకు
అని గద్దిస్తున్నాను ఢిల్లీ పోలీసు


పాలక వర్గం నుంచి అందుకున్న ఆదేశాలు
ఫలించాక ఇదిగో వీళ్లు రెచ్చిపోతున్నారు
అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ కారులు
వాపోతున్నారు


దేశం అంతా ఇటు  చూస్తుంది
పోరాటం మరింత ఉద్ధృతి అయింది
అయినా మోడీ సర్కార్ కు ఇవేవీ పట్టవు
నిలువ నీడ లేకుండా చేసి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని
అపహాస్యం చేస్తున్నారు. ఇది సబబు కాదు
అని అంటున్నారు వామపక్షాల లీడర్లు


ఇదీ ఉద్యమ సూరీడుల గొంతు..వినండిక...


చలి చీమలు కొన్ని.. కలిసి పోరాడతాయి..బలవంతుడు ఓడిపోయిన రోజు సామాన్యుడి ఆదేశం ఒకటి గెలుస్తుంది. లేదా లేనివాడి నిర్ణయమో పక్క వాడి బలమో కలిసి వచ్చి కొత్త ఉద్యమానికి రూపకల్పన సాగుతుంది. మూలాలు విడిచి పాలకులు ప్రవర్తిస్తే కొత్త శక్తుల ఆవాహనకు తాము సిద్ధమని అంటోంది వామపక్షం. ప్రాంతాలకు అతీతంగా సాగుతున్న ఉద్యమానికి తెలంగాణ మద్దతు పలికింది. పట్టెడన్న పెట్టి పంపింది. ఖమ్మం, వరంగల్ ఇలా అన్ని ప్రాంతాలూ ఈ ఉద్యమ బిడ్డలకు వందనాలు చెప్పి.. ఆహారం పెట్టి పంపాయి. కానీ ఢిల్లీ పోలీసులు పాలకుల ఆదేశాను సారం ఉద్యమ కారులను హింసిస్తున్నారు. మాటలతోనూ, చేతలతోనూ ఇలానే హింసిస్తూ పోతే ఈ రాజ్య హింసకు పరిహారం తప్పక చెల్లించుకోవాల్సింది మోడీ సర్కారే అన్నది మరిచిపోయి మరీ ప్రవర్తిస్తోంది అని వాపోతున్నారు ఉక్కు పోరాటకర్తలు. మీకు ఇక్కడ హోటల్ రూమ్ లు ఎవరిచ్చారు..మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఏసీపీ స్థాయి వ్యక్తులు నిన్నంతా వాళ్లను టార్చర్ చేశారు. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కాపాడాలని చెప్పడంలో నేరం ఉంది. అందుకే తదనుగుణ శిక్ష ఒకటి మోడీ సర్కారు అమలు చేస్తోంది. ఈ శిక్షకు మూల్యం చెల్లించక తప్పదు. అవును! ప్రజా కోర్టే కీలక మార్పునకు శ్రీకారం దిద్దగలదు. అందాక పోరు తప్పదు.. ఆకలీ మరియూ అవమానమూ తప్పదు..ఇదీ ఉద్యమ సూరీడుల గొంతు..వినండిక...

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: