బీజేపీ పార్టీకి అపూర్వ చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లుగా హిందూత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగుతోంది. అలాగే గోవధకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. అలాంటి బీజేపీ పార్టీలో మరోసారి గొడ్డ మాంసం విషయం తెరపైకి వచ్చింది. తాజాగా.. ఓ బీజేపీ పార్టీకి చెందిన ఓ మంత్రి... గొడ్డు మాంసం తినాలని ప్రజలకు చెబుతున్నారు. మిగతా మాంసం కన్నా.. ఎక్కువగా గొడ్డు మాంసం తినటానికే.. ప్రాధాన్యత ఇవ్వాలని ఆ మంత్రి పిలుపునిస్తున్నారు. అదేంటి బీజేపీ నేత ఇలా అంటున్నారు అనుకుంటున్నారా ? అవును నిజమే.
వివరాల్లోకి వెళితే.. మేఘాలయ రాష్ట్రానికి చెందిన మంత్రి వర్యులు సన్ షుల్లాయ్... దక్షిణ షిల్లాంగ్ నుంచి ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి కూడా గెలిచి... మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్నారు. అయితే.. ఆయన తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర మాంసం కంటే.. అధికంగా గొడ్డు మాంసం తినాలని ప్రజలకు చెప్పారు. గొడ్డు మాంసాన్ని ప్రజలు తినేందుకే ప్రోత్సహిస్తామన్నారు. ఇలా చేయటం కారణంగా బీజేపీ పార్టీ గోవధపై నిషేధం విధిస్తుందనే వాదన ప్రజల్లో కలుగదని.. ఆయన అభిప్రాయపడ్డారు.
డెమొక్రటిక్ కంట్రీస్ ల్లో ప్రజలు తమకు ఇష్టమైన.. ఫుడ్ తినే స్వేచ్ఛ ఉంటుందని ఆయన వెల్లడించారు. అలాగే మంత్రి వర్యులు సన్ షుల్లాయ్.. మేఘాలయం మరియు అస్సాం రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదంపై కూడా స్పందించారు. సరిహద్దులను రాష్ట్రాలు కాపాడుకోవాల్సిన అవసరమం ఎంతైనా ఉంటుందని చెప్పారు. సరిహద్దు సమస్యలు చాలా సున్నితమైనవి అని పేర్కొన్న ఆయన.. ఆ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. అయితే.. మంత్రి వర్యులు సన్ షుల్లాయ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల్లోనే వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీ నేత అయి ఉండి.. పార్టీ వ్యతిరేక మాటలు మాట్లడటం ఏంటని సన్ షుల్లాయ్ పై మండి పడుతున్నారట.