కేసీఆర్ పై తొలిసారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ విమర్శలు..?

Chakravarthi Kalyan
ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం మిగిలిన జీవితం ధారపోస్తానని ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ అంటున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేసీఆర్ సర్కారుపై నేరుగా ఎక్కడా విమర్శలు చేయలేదు. తాను వరుసగా 9 ఏళ్లు గురుకులాల కార్యదర్శిగా ఉండేందుకు కేసీఆర్ సహకరించారని ఆయన చెబుతుండేవారు. కేసీఆర్ సహకారం వల్లనే గురుకులాలు బ్రహ్మాండంగా సక్సస్ అయ్యాయని చెబుతుండేవారు.


అయితే.. ఆయన అప్పుడు ప్రభుత్వ అధికారి.. కానీ ఇప్పడు ఆయనకు ప్రభుత్వ బంధనాలు లేవు. అందుకేనేమో ఇప్పుడు స్వేచ్ఛగా అన్నీ మాట్లాడుతున్నారు. తాజాగాఘట్‌ కేసర్‌ మండల పరిధిలోని ఏసీఈ ఇంజనీరింగ్‌ కళాశాలలో బహుజన పొలిటికల్‌ స్కూల్‌ పేరుతో జరిగిన సదస్సు ఆయన పాల్గొన్నారు. స్వేచ్ఛగా తన మనసులో భావాలు ఆ సదస్సులో పంచుకున్నారు. గురుకులాలకు నిధులు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటనలు చేయటం తప్ప.. ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయలేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.


బహుజనుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర డీజీపీగా పదోన్నతి వచ్చే అవకాశాన్ని తాను వదులుకున్నానని  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆరున్నర ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. ఇంకా అవసరం లేదని డీజీపీగా అవకాశం ఉన్నప్పటికీ పదవికి రాజీనామా చేశానని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల విద్య కొరకు పాలకులు ఎప్పుడూ ఆలోచించలేదన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.


99 శాతం ఉన్న వెనుకబడిన వారు అధికారంలోకి రావటంలేదని..  ఒక్క శాతం జనాభా ఉన్న వారు మాత్రమే అధికారంలో కొనసాగుతున్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే బలిదానాలు అయ్యారన్నారు ప్రవీణ్ కుమార్. ఇకైనానా బానిస బతుకులకు చరమగీతం పాడాలని.. ఆగ్రవర్గాలను గద్దె దింపి బహుజనులు రాజ్యాధికారం సాధించుకునేలా ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: