రాజు గారి కవర్ డ్రైవ్‌లు..ఇక కష్టమేనా!

M N Amaleswara rao
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద ఆధార సహితంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో రఘురామ రాజు ఎవరెవరితో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అన్నది వివరించింది. దీనికంతటికీ ఆధారం రాజు గారి ఫోన్. ఆయన ఫోన్ ని అప్పట్లో స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు లోతుపాతులన్నీ కూడా దర్యాప్తు చేసి మరీ రాజు గారి గుట్టు బయటపెట్టేశారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ఇక చంద్రబాబు లోకేష్ లతో వాట్సప్ సంభాషణలు రాజు జరిపేవారు అని కూడా కనిపెట్టారు.

మొత్తానికి ఈ రకమైన ఆధారాలతో ఆయన తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు అని కనుగొన్నారు. రాజు తాను వైసీపీ ఎంపీనని, ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నానని ఇన్నాళ్ళూ చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడం తప్పా అని కూడా ఆయన ప్రశ్నించేవారు. ఈ నేపధ్యంలో రాజుకు వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న వారితో బలమైన స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని కూడా కనుగొన్నారు. ప్రత్యేకించి ఆయన ఢిల్లీలో రచ్చబండ పేరిట పెట్టే ప్రెస్ మీట్లు అన్నీ కూడా టీడీపీ పెద్దల కనుసన్ననలోనే జరిగాయని కూడా పేర్కొంటున్నారు.

మరి రాజు ఇంతకాలం చెప్పిన దానికి సుప్రీం కోర్టులో ప్రభుత్వం అవిడవిట్ దాఖలు చేసిన దానికీ చూస్తూంటే చాలా తేడా కనిపిస్తోంది. అంతే కాదు, రాజు తాను శుద్ధ పూస‌ను అని నమ్మించే ప్రయత్నం చేశారా అన్న చర్చ కూడా వస్తోంది. జగన్ తో పడకపోతే ఆ పార్టీకి రాజీనామా చేయాలి, లేదా దూరంగా ఉండాలి, అంతే తప్ప ఈ రకంగా వైసీపీ వ్యతిరేకులతో చేతులు కలపడం ప్రభ్తువాన్ని కూలదోసే కుట్రగానే అభివర్ణిస్తున్నారు. మరి ఈ అంశాల్లో రాజుగారు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఫోన్‌ని పోలీసులు ఏదో చేసి ఉంటారని, ఒకవేళ చంద్రబాబుతో చాట్ చేసినా, అది రాజద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా తాజాగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. మొత్తానికైతే రాజుగారు అడ్డంగా దొరికేసి, ఇప్పుడు కవర్ డ్రైవ్‌లు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: