విశాఖ వైసీపీలో హాట్ టాపిక్‌గా ఆ మ‌హిళా నేత ?

VUYYURU SUBHASH
విశాఖ జిల్లాలో ఉన్న మహిళా నాయకురాళ్ళలో అగ్రభాగన ఆమె ఉన్నారు. ఆమెది దాదాపుగా పద్నాలుగేళ్ల రాజకీయ ప్రస్థానం. ప్రజారాజ్యం పాటీని సినీ నటుడు చిరంజీవి ప్రారంభినపుడు ఆ పార్టీలో చేరడం ద్వారా ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లోకి విలీనం అయినపుడు అందులో చేరి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు. ఆమె రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తాజాగా ఆమె వైసీపీలో చేరారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన పేడాడ ఉన్నత విద్యావంతురాలిగా కూడా ఉన్నారు. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఐడియాలజీని పూర్తిగా అర్ధం చేసుకుని దానికి తగినట్లుగా పనిచేయడం అలవాటుగా చేసుకున్నారు. ఆమె గాడ్ ఫాదర్స్ ఎవరూ లేకుండానే రాజకీయాల్లో ఎదిగారు. ఆమె సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో నిర్వహించడం ద్వారా తగిన గుర్తింపు సంపాదించుకున్నారు. వైసీపీలో ఆమె రాకను ఎంపీ విజయసాయిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఆమె రాకతో బలమైన గొంతు  బడుగు మహిళల తరఫున వినిపించే అవకాశం వస్తుందని కూడా పార్టీ నాయకులు అంటున్నారు.

విశాఖ సిటీలో వైసీపీకి మహిళా నాయకురాళ్ల కొరత ఎక్కువగా ఉంది. ఆ లోటుని పేడాడ ఇపుడు భర్తీ చేస్తున్నారు. ఆమె పార్టీని మరింతగా ప్రజలలోకి తీసుకుపోవడంతో పాటు మహిళా సమస్యలను పరిష్కరించే దిశగా కూడా తన వంతుగా కృషి చేస్తున్నారు. పేడాడ రమణి కుమారి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీ సిటీలో కానీ రూరల్ జిల్లాలో కానీ మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు.

వచ్చే ఎన్నికల్లో ఆ కోటా కింద ఆమెకు కచ్చితంగా టికెట్ దక్కుతుంది అంటున్నారు. ఆమె విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ఈ లోగానే ఆమె సేవలను వినియోగించుకోవడానికి నామినేటెడ్ పదవి కూడా ఇస్తారని టాక్. మొత్తానికి పేడాడ విశాఖ వైసీపీలో కీలకమైన నాయకురాలిగా ఉన్నారని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: