ప్రెస్ మీట్ పెట్టిన గణేష్ ఉత్సవ కమిటీ.. ఏమన్నారంటే?
వైరస్ వ్యాప్తి దృశ్య ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు ఎన్నో జాగ్రత్తలు మధ్య నిర్వహిస్తామంటూ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఇక ఈ నెల 23వ తేదీన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఓపెన్ చేస్తాం అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10 నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఇక నిమజ్జనం ప్రక్రియ సెప్టెంబర్ 19 వ తేదీన ఆదివారం రోజున జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ప్రభుత్వం రా మెటీరియల్ టైం కి ఇవ్వాలని ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ కోరింది.
గణేష్ ఉత్సవాలకి 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నాము అంటూ స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల్లో గణేష్ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి వారు వెంటనే రోడ్లు బాగు చేయాలి అంటూ ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కోరింది. గణేష్ నిమజ్జనం సమయానికి రోడ్లు బాగూ అయ్యేలా చూడాలి అంటూ విజ్ఞప్తి చేసింది. ఇక అందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది. ఇక గణేష్ ఉత్సవాల సమయంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి ఇక దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలనే ప్రతిష్టాస్తామని ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తెలిపింది ఇక గణేష్ ఉత్సవ కమిటీ కి అందరు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.