బక్రీద్ రోజున ఆంక్షలు ఇవే..!

NAGARJUNA NAKKA
ముస్లిం సోదరులు.. సహోదరీలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ బక్రీద్. ఈ నెల 20న వేడుకను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పర్వదినాన ముస్లిం సోదరులు ప్రార్థనా స్థలాల దగ్గర గుమిగూడటం సర్వసాధారణమే. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండగా.. ఇలా గుంపులుగా ఉండటం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించుకునే విధానంలో.. తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మసీదుల్లో ముస్లిం సహోదరులు 50శాతం మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. అంతేకాదు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.  

ఇక ఈద్గాలు, ఖాళీ ప్రదేశాల్లో ఎలాంటి ప్రార్థనలు చేసుకోవద్దని షరతులు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మతపరమైన వేడుకలను నిషేధించింది ఏపీ ప్రభుత్వం. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం వల్ల వైరస్ మరింత విజృంభిస్తుందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ప్రార్థనల్లో పాల్గొనే ప్రతీ ముస్లిం సహోదరుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. అంతేకాదు మసీదు నిర్వహకులు శానిటైజర్లను భక్తులకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ప్రార్థనలకు వెళ్లే ముస్లిం సహోదరులు తమ వెంట తప్పనిసరిగా మ్యాట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇక జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలున్న వారు మసీదులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఇలాంటి లక్షణాలున్న వారికి కరోనా లక్షణాలుంటే.. మసీదుకు వెళ్లడం ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.  అలాంటి వారు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకునే సమయంలో ముస్లిం సోదరులు అలింగనం విషయంలో దూరంగా ఉండాలని హితవు పలుకుతోంది ఏపీ  ప్రభుత్వం.ముస్లిం సహోదరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. చూద్దాం. ముస్లింలు బక్రీద్ పండుగ ఎలా నిబంధనలు పాటిస్తారో.  
 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: