తెలంగాణ బీజేపీకీ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా...?

MOHAN BABU
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల వరకు బిజెపి పార్టీ అధికారం చేపట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ వచ్చే ఎన్నికల వరకు మరో దీటైన పార్టీ రథసారధినీ ఎంపిక  చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే అధికార టీఆర్ఎస్ పార్టీని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని  దిటుగా ఎదుర్కోగల యువ నాయకత్వాన్ని ఎంపిక చేయడానికి బిజెపి కసరత్తు చేస్తోంది. దీనికోసం రాష్ట్ర పార్టీలో చురుకుగా పని చేస్తున్నటువంటి యువ నేతలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందనీ సమాచారం. రాష్ట్రంలో ప్రజలు  ఇప్పుడు బిజెపికి అనుకూలంగా మారినప్పటికీ, వారిని ఓటు బ్యాంకుగా మార్చే సత్తా గల రథసారథి లేకపోవడం వల్ల దశాబ్దాల కాలం నుంచి  బిజెపి చతికిల పడుతూ వస్తోంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా దేశంలోనే  హన్మకొండ నుంచి ఒక ఎంపీని ఢిల్లీకి పంపించి  తెలంగాణలో తన సత్తా చూపించింది.
 ఆనాటి కాలంలో వరంగల్ జిల్లా నుంచి ఎంపీ అయితే, బైరాన్ సింగ్ షెకవత్ మరో ఎంపీ రూపంలో బిజెపికి గట్టి పునాది వేసింది అని చెప్పవచ్చు. ఆనాడు 2 ఎంపీలతో ఉన్నటువంటి పార్టీ, ప్రస్తుతం వరుసగా  కేంద్రంలో రెండుసార్లు అధికారాన్ని చేపట్టింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బలపడడం చాలా కష్టంగా మారింది.  ఏళ్లు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి పార్టీకి గట్టి పునాదులు వేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు ప్రజలు కట్టబెట్టారు. అప్పటినుంచి బీజేపీ కేంద్రం చూపు తెలంగాణపై పట్టు సాధించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. అలాగే మరొక ఎంపీకి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పజెప్పింది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ కొంత పుంజుకున్నది అని చెప్పవచ్చు. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కొంత మేర ఫలితాలు రావడం చూస్తే మెరుగైన సామర్థ్యాన్ని  పరిచినట్లు ఫలితాలు వెల్లడించాయి.
అనంతరం వచ్చిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం డిపాజిట్ కూడా కోల్పోవడం పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు , వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే పార్టీ ఏ రకమైన ప్రజా కార్యక్రమాలు  చేపట్టకుండా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు బిజెపి వైపు నుంచి  ఇతర పార్టీలోకి తమ దృష్టి మళ్ళించే అవకాశం ఉన్నదని  పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డినీ తట్టుకొని  అనేక కార్యక్రమాలు రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి  యువతను ఆకట్టుకునే అధ్యక్షుడు నియమిస్తే తప్ప రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
 ఎలాగైనా 2023 ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని  అధిష్టానం గట్టిపట్టుతో ఉన్నది.
 తెలంగాణలోని ప్రజలు బీజేపీ పార్టీ పట్ల సానుకూలంగా స్పందించడాన్ని, గ్రహించిన పార్టీ అధిష్టానం దీటైన రథసారదీనీ ఎన్నుకుంటే అనుకున్న ఫలితాలు రావచ్చని  అభిప్రాయపడుతున్నాయనీ సమాచారం . మాటకు మాట మాట్లాడే నాయకుడు కోసం అధిష్టానం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు మరియు బీజేవైఎంలో ఉన్న కీలక నేతల పనితీరును సైతం పరిగణలోకి తీసుకొని  రాష్ట్ర రథసారథి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: