పట్టు వీడని కేసీఆర్.. ఏపీ సర్కార్ కి షాక్ తప్పదా?

praveen
ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతుంది అనే విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణకు రావాల్సిన నిధులను  ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకుపోతుంది అంటూ గత కొన్ని రోజుల నుంచి ఏపీ అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం సంచలనంగానే మారింది.  ఈ క్రమంలోనే ఎన్జీటీ లో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేసిన దిక్కరణ పిటిషన్ ను ఏఏజీ రామచంద్రరావు ప్రస్తావించారు.



 ఇదే అంశంపై గతంలో పిటిషన్ వేసిన శ్రీనివాస్ పిటిషన్ మాత్రం ప్రస్తావనకు రాకపోవటం గమనార్హం. అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం దిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కె ఆర్ఎంబి తో పాటు కేంద్ర పర్యావరణ శాఖను నివేదిక సమర్పించాలని అంటూ కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తనిఖీ చేయకుండా ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతుంది అంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేకపోయాము ఎన్జిటి కి ఇటీవలే ఏఏజీ రామచంద్ర రావు తెలిపారు.




 ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్వయంగా ఎన్జీటీ నే రంగంలోకి దిగి తనిఖీ చేయాలి అంటూ ఇటీవల తెలంగాణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే గతంలో ఇదే అంశంపై శ్రీనివాస్ వేసిన పిటిషన్ తో పాటు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేసిన దిక్కరణ పిటిషన్ ఫై కూడా విచారణ జరపాలని ఏఏజీ రామచంద్రరావు కోరారు. అయితే ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం జూలై 23 వ తేదీన విచారణ జరుపుతామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది ఎన్జిటి.  ఈ క్రమంలోనే జూలై 23వ తేదీన విచారణలో ఎలాంటి తీర్పు వెలువడబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్వహిస్తున్నారు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో అటు ఏపీ లోని అధికార పార్టీ నేతలు మాత్రం తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు.  ఒకప్పుడు కృష్ణా జలాల పంపిణీపై సంతకాలు చేసి ఇప్పుడు ఇలా ఇబ్బందులు సృష్టించడం వెనుక రాజకీయ ఉద్దేశమే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: