రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు..!
అబీ అహ్మద్ అలీ 2018లో ఇథియోపియా నాలుగో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇథియోపియో-ఎరిట్రియా మధ్య ఎన్నో సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఆ సమస్యను పరిష్కరించడంలో అబీ అహ్మద్ అలీ విజయం సాధించారు. 2018లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే రోజే.. ఎరిట్రియా అధ్యక్షుడితో చర్చలు జరిపి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేందుకు అడుగులు వేశారు.
ఎరిత్రియాలో శాంతి స్థాపనకు కృషి చేసిన అబీ అహ్మద్ ను నోబెల్ పురస్కారం వరించింది. 2019లో ఆయనకు ఆ గౌరవం దక్కింది. ఎరిత్రియా-ఇథియోపియా మధ్య సరిహద్దు అంశం వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. అలాంటి కండీషన్ లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబీ అహ్మద్.. ఆ దేశ అధ్యక్షుడితో సామరస్యంగా మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతేకాదు ఎరిత్రియాలో శాంతి మంత్రాన్ని పాటించేలా చేశారు. అదే ఆయనకు నోబెల్ రూపంలో గౌరవం తెచ్చిపెట్టింది. 1998వ సంవత్సరం నుండి 2000వ సంవత్సరం వరకు ఇథియోపియా-ఎరిత్రియా మధ్య యుద్ధాలు జరిగాయి. ఎన్నో సంవత్సరాలు శత్రువులుగా కొనసాగిన దేశాలు అబీ అహ్మద్ చర్చలతో మిత్ర దేశాలుగా మారాయి. 2019లో నోబెల్ పురస్కారం అందుకున్న ఇథియేపియా ప్రధాని అబీ అహ్మద్ కు.. 9లక్షల అమెరికా డాలర్ల నగదు కూడా లభించింది.