భారత ప్లాన్ ని కాపీ కొట్టిన చైనా.. ఏం చేస్తుందంటే?
కానీ గత కొన్ని రోజుల నుంచి మరోసారి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తుంది చైనా. ఇక రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ ఏ క్షణం లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది సరిహద్దుల్లో పరిస్థితి. ఒకవైపు చైనా మరోవైపు భారత్ కూడా భారీగా సైన్యాన్ని ఆయుధాలను మోహరిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో వాతావరణం మరింత హాట్ హాట్ గా మారిపోతుంది. అయితే భారత ఆర్మీ ఎన్నో ఏళ్ల నుంచి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ని మెయింటైన్ చేస్తోంది. టిబెటన్ యువతను ఇక భారత సైన్యం లోకి తీసుకోని వారితో ఒక ప్రత్యేకమైన ఫోర్స్ ఏర్పాటు చేసింది. గతంలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో టిబెటన్ సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడారు.
ఈ నేపథ్యంలోనే ఇక తమ సైన్యంలోకి కూడా టిబెటన్లు తీసుకోవాలని భారత్-చైనా సరిహద్దుల్లో భారత బలగాల ను అడ్డుకునేందుకు టిబెట్ యువతులు తమ సైన్యంలోకి చేర్చుకుంటుంది. గతంలో కొన్ని నెలల క్రింద జరిగిన భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో టిబెటన్ యువత ఎంతో వీరోచితంగా పోరాడటం గమనించిన చైనా ఇలాంటి తరహా ప్లాన్ కు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం భారత్ చైనా ఎల్ఏసి వెంబడి సైన్యాన్ని మొహరించేందుకు ప్రస్తుతం వారికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది. మరోవైపు ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో పహారా కాసేందుకు చైనా సైనికులు భయపడుతున్న నేపథ్యంలో ఇలా టిబెటన్ సైనికులను రంగంలోకి దింపేందుకు చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది.