మహిళా MPDO ఫై.. మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు?
ఓ మహిళా ప్రభుత్వ అధికారి పట్ల మంత్రి వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సరికొత్త వివాదానికి తెరలేపింది. ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి ఇలా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన తెలంగాణ మంత్రి ఎవరో కాదు టీఆర్ఎస్ కీలక నేత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఉన్న మహిళా ఎంపీడీవో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామ సభలో మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు కాస్త అందరినీ షాక్ కి గురి చేసాయ్. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో ఇటీవలె మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఇక మైక్ పట్టుకొని మాట్లాడుతున్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెబుతున్నారు. అదే సమయంలో ఇక అక్కడ ఉన్న ఎంపీడీవో గురించి మాట్లాడుతున్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న ఎంపీడీవో మహిళా అధికారి అని తెలిసినప్పటికీ అలాగే మాట్లాడారు. ఎంపీడీవో మేడం మీరు బాగానే ఊపుతున్నారు.. కానీ ఇక్కడ ఊపడం లేదు.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎర్రబెల్లి. అటు వెంటనే కవర్ చేసుకునేందుకు అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి.. వెళ్లేటప్పుడు పార్క్ ఎలా ఉందో చూస్తాను అంటూ మాట్లాడారు. కాగా దీనికి సంబందించిన వీడియో కాస్తా ప్రస్తుతం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది