రఘురామకి చెక్ పెట్టేసినట్లేనా..ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
అయినా సరే రఘురామపై వేటు పడలేదు. దీంతో రఘురామ ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారో అందరికీ తెలిసిందే. అలాగే వైసీపీ ప్రభుత్వం, రఘురామల మధ్య ఎలాంటి వార్ జరిగిందో కూడా తెలుసు. ఇలా తమ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉన్న రఘురామపై వేటు వేయించాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.
కానీ లోక్‌సభ స్పీకర్ మాత్రం ఇంకా రఘురామపై వేటు వేయలేదు. దీంతో ఆయనకు వైసీపీ ఎంపీలు లేఖలు రాస్తూనే ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన పదవిపై వేటు వేయాలని వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా కూడా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్‌లు స్పీకర్‌ని కలిసి, రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు.
ఈ క్రమంలోనే స్పీకర్ కాస్త రఘురామకు అనుకూలంగా ఉన్నారనే వాదనని విజయసాయిరెడ్డి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పీకర్, రఘురామ విషయంలో పెద్దగా స్పందించడం లేదనే విధంగా మాట్లాడారు. ఒకవేళ రఘురామపై వేటు వేయకపోతే, పార్లమెంట్లో ఆందోళనకు దిగుతామని స్పీకర్‌కు చెప్పామని విజయసాయి అన్నారు.
కాబట్టి స్పీకర్ పక్షపాత వైఖరి వీడి రఘురామపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రఘురామపై అనర్హత వేటు వేసే విషయంలో వైసీపీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందుకే పార్లమెంట్లో సైతం ఆందోళనకు దిగుతామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. మరి ఈ స్టేట్మెంట్తో స్పీకర్, రఘురామపై వేటు వేస్తారేమో చూడాలని వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా రఘురామకు చెక్ పెట్టేస్తామని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. చూడాలి వైసీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో?