పేటీఎం సరికొత్త ఆఫర్.. చేతి ఖర్చులకు డబ్బులు?

praveen
ప్రస్తుతం మొత్తం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేదు..  అర చేతిలో ఉన్న స్మార్ట్  ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు హాయిగా కూర్చన్న చోటు నుండి  వేరే అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు కూడా ఎంతో సులభంగా మారిపోయాయి. ఎక్కడికి వెళ్లకుండానే స్మార్ట్ ఫోన్ నుంచి జరిగిపోతున్నాయి.



 అటు వినియోగదారులందరికీ మరింత వేగవంతంగా, సరికొత్తగా సేవలు అందించేందుకు ఎన్నో డిజిటల్ పేమెంట్ యాప్స్ కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇక వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి డిజిటల్ పేమెంట్ యాప్స్. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా కస్టమర్లను ఆకర్షిస్తూ తమ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది డిజిటల్ పేమెంట్ పేటీఎం.  ఎప్పుడు వినూత్నమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది.  ఈ క్రమంలోనే కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా లోన్స్ కూడా ఇస్తుంది. ఇక ఇప్పుడు మరో సరికొత్త లోన్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది పేటీఎం.




 ఇప్పటికే బై నౌ పే లేటర్ అనే ఓ సరికొత్త సర్వీస్ ను తమ వినియోగదారులకు అందిస్తుంది పేటీఎం. ఇక ఈ సర్వీసుకు కొనసాగింపుగా ఇక ఇప్పుడు సరికొత్త లోన్ ఆఫర్  తీసుకు వచ్చింది. పోస్ట్ పెయిడ్ మినీ అనే సర్వీస్ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది పేటీఎం. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులందరికీ కూడా చిన్న మొత్తంలో చేతి ఖర్చుల కోసం నెలవారీగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో పేటీఎం ఆఫర్ అందిస్తోంది. ఈ సర్వీస్లో భాగంగా 250 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు మినీ లోన్ పొందవచ్చు. ఇక నెలరోజులు కాల పరిమితి ఉంటుంది. అయితే ఎలాంటి వడ్డీ ఉండదు. కేవలం కన్వీనియన్స్ ఫీజు మాత్రమే ఉంటుందని పేటీఎం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: