జగన్ ను దెబ్బ తీయడానికి బాబోరు మాస్టర్ ప్లాన్ ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. ఒకవైపు చక్కని పరిపాలనా తీరుతో ప్రజలకు ఏవైతే మానిఫెస్టోలో చెప్పాడో, వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న మిగతా పార్టీలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ఇప్పుడు ప్రజలకు ఏమి చెప్పినా వినరు అనే స్థితికి వచ్చేశారు. అందుకే ఏపీ ప్రతిపక్ష నాయకుడు మరియు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎక్కడా నోరుమెదపడం లేదు. తెలంగాణ ఏపీకి మధ్యన పెద్ద ఎత్తున జల వివాదం జరుగుతుంటే ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. ఈ వైఖరిని ప్రజలంతా తీక్షణంగా గమనిస్తున్నారని మరిచిపోయినట్టున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.
ఇందులో భాగంగా ఒక కీలక వ్యహం అమలుపరిచే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.  ఇంతకీ విషయం ఏమిటంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మరింత మద్దతును మరియు బలాన్ని కూడగట్టుకోవడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో త్వరలోనే భేటీ కానున్నట్లు వినికిడి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా మంచి పేరుంది. ఇప్పటి వరకు కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయంగా ఎటువంటి వివాదాలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ లేవు. ఏ విషయం అయినా ముక్కుసూటిగా చెప్పగలడు. ఇబ్బందికర పరిస్తితుల్లో కీలక నిర్ణయాలను తీసుకోవడంలో దిట్ట అని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతనికి నోటిలో నాలుకలా మెదిలాడు. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల వలన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కలవడానికి కారణం ఏమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు తలలు పీక్కుంటున్నారట, అయితే చంద్రబాబుకు దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కాగన్ ను దెబ్బతీయడానికి కిరణ్ కుమార్ సహకారం కోసమే అన్నది ప్రముఖుల వాదన. మరి ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడైన కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరిస్తాడా ? ఈ భేటీతో వైసీపీకి ఎంత వరకు నష్టం అన్న పలుకోణాల్లో రాజకీయ వర్గాలు ఆలోచిస్తున్నాయి. మరి ఏమి జరగనుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: