జంతువులకు కరోనా వ్యాక్సిన్?
ఈ క్రమంలోనే వైరస్ పై ఎంతో సమర్థవంతంగా పోరాటం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగవంతంగా కొనసాగిస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. అయితే ఇప్పటికే అమెరికాలో 90% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక అక్కడ కొన్ని ప్రాంతాలలో మాస్కు తప్పని సరి కాదు అన్న సడలింపు కూడా ఇచ్చింది. అయితే కేవలం మనుషులపైన కాదు అటు జంతువుల పైన కూడా కరోనా వైరస్ ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే ఇక అటు జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైంది అమెరికా. ఇటీవల అమెరికాలోని ఓక్లాండ్ జూ లో ఉన్న జంతువులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.
ప్రత్యేకంగా జంతువుల కోసం తయారు చేసిన టీకాను ఇచ్చారు. జూ లో ఉన్న ఫులులు,ఎలుగుబంట్లు, సింహాలకు ఈ కరోనా టీకా ఇచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఇక జూ లోని జంతువులు అన్నింటిని కూడా వాటి రోగ నిరోధక శక్తి పెంచేందుకు టీకాలు ఇస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. జోటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసమే వ్యాక్సిన్ తయారు చేసినట్లు అక్కడి వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జోటిస్ సంస్థ ఇప్పటి వరకు 70 జూ లకు 11000 టీకా లను పంపిణీ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వరకు జూలో ఏ ఒక్క జంతువు కూడా కరోనా వైరస్ బారిన పడ లేదు అంటూ ఆ వైద్యులు తెలిపారు.