సిసి టివి ఫుటేజ్ విడుదల.. యాక్సిడెంట్ ఎంత ఘోరమో?
హైదరాబాదులోని మాదాపూర్లో ఇటీవలే ఒక ఆడి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన ఆడి కారు ఇక ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ఆటో నాలుగైదు సార్లు పల్టీ కొట్టింది. ఇక ఈ రోడ్డు ప్రమాదం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మృతి చెందాడు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి . అయితే ఇటీవలే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
అంతేకాకుండా ఈ ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ను ఇటీవలే విడుదల చేసారు హైదరాబాద్ పోలీసులు. అయితే ఇక ఈ వీడియో చూస్తుంటే అచ్చం సినిమాల్లో లాగానే ఈ ఆక్సిడెంట్ అత్యంత ఘోరంగా జరిగింది. అప్పటికే రోడ్డు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ఈ క్రమంలోనే ముందుగా ఒక ఆటో వెళుతుంది. అటు వెంటనే రెప్పపాటుకాలంలో వెనుక నుండి అతి వేగంతో దూసుకు వచ్చింది ఆడి గారు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో ముందు ఆటో ఉన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు కార్ లోని వ్యక్తులు. ఈ క్రమంలోనే అదే స్పీడ్ తో ఆటో ఢీకొనడంతో ఆటో నాలుగైదు ఫల్టీలు కొట్టింది. కార్ మాత్రం అలాగే దూసుకుపోయింది అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ కార్ నెంబర్ పీకేసి అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. పోలీసులు రంగంలోకి దిగి మద్యం మత్తులో కారు నడిపిన సుజిత్, ఆశిష్ లను అరెస్టు చేశారు.