జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

Chakravarthi Kalyan
కొన్నిరోజుల క్రితం ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు మహిళలే. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగ మావోయిస్టులు జులై ఒకటిన ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమీటీ సిపిఐ మావోయిస్టు గణేష్ ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.

ఈ లేఖలో ఎన్‌కౌంటర్‌ వివరాలు తెలిపారు. జూన్ 16వ తేదీ ఉదయం  9.30 గం.లకు తీగల మెట్ట గ్రామానికి దూరంగా అడవిలో మకాం వేసి ఉన్న ప్రాంతానికి నాలుగు వైపుల నుంచి పోలీసులు బలగాలు చుట్టుముట్టి అకస్మికంగా దాడి చేశాయన్నారు. శత్రువుని ప్రతిఘటిస్తూ ఆరుగురు కామ్రేడ్ లు అమరులయ్యారని... వీరికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని.. వీరి ఆశయాలను తుది కంటా కొనసాగిస్తామని లేఖలో తెలిపారు.

దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక వైపు కరోనా సమస్యలతో జనజీవనం అల్లకల్లోలంగా  ఉన్న పరిస్థితులలో పార్టీ ప్రజల కోసం వైద్యానికి ఆహారానికి అందించడం వంటి ప్రధానంగా కార్యక్రమంగా చేసుకుంటూ ఎటువంటి ప్రతిఘటన చర్యలను చేపట్టలేదని గణేశ్‌ తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కాకుండా ఆదివాసి ప్రాంతంలో కనీసం వైద్యం అందించడం కాదు కదా కరోనా టెస్టింగ్ కూడా చేయలేదని విమర్శించారు. ఇంతవరకూ మన్యం లో ఏ ఒక్క డాక్టర్ కూడా రాలేదు.. ఏ ఒక్కరిని వైద్యం అందించడం లేదని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం ఆదివాసి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడమే లక్ష్యంగా చేసుకుందని.. దానికి ఆటంకంగా ఉన్న మావోయిస్టు ఉద్యమానికి ప్రజా ఉద్యమానికి సమూలంగా నిర్ములన లక్ష్యంగా పెట్టుకుందని గణేశ్ అన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుతో వందలాది పోలీసులు బలగాలను ఆదివాసి ప్రాంతంలోకి పంపిస్తుందని.. నిర్బంధ కాండలో భాగంగానే ఇన్ఫార్మర్ ద్వారా సమాచారానికి తెలుసుకొని దాడి చేశారని విమర్శించారు. ఈ దాడిలో మావోయిస్టు పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిందని.. సమీక్షించుకుని ప్రజా యుద్ధానికి ముందుగా కొనసాగిస్తామని గణేశ్ లేఖలో తెలిపారు. తీగల మిట్ట ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జులై 1వ తేదీన తలపెట్టిన ఓవోబీ జోన్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: