డెల్టా ప్లస్ చాలా డేంజర్.. పక్క నుండి వెళ్ళిన సోకుతుందట?

praveen
చైనా నుంచి వెలుగు లోకి వచ్చిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కరోనా వైరస్ కేసులు తగ్గాయని ప్రపంచం ఊపిరి పీల్చుకున్న తరుణం లో మళ్లీ రూపాంతరం చెంది కొత్తరకం వైరస్ లా వ్యాప్తి చెందుతుంది  మళ్లీ మారణ హోమం సృష్టించింది. ఇలా కోలుకున్నామని అనుకునే లోపే చివరికి మరో కొత్త రకం వైరస్ భయ పెడుతుంది. ఇలా రోజు రోజుకు సరికొత్త వేరియంట్ లు వెలుగు లోకి వస్తు శరవేగం గా పాకిపోతుండడం తో అన్ని దేశాలు ఆందోళనలో మునిగిపోతున్నాయి.



 అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే 11 దేశాలకు పాకి పోయింది. డెల్టా వేరియంట్స్ నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ ఇంకా మరింత ప్రమాదకరంగా మారిందని వైద్యనిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎంతో వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటూ హెచ్చరిస్తున్నారు. లేకపోతే విపత్కర పరిస్థితులు రావడం  ఖాయం అంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.



 ఇక తాజాగా వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కు పెట్టుకోకుండా ఇక ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి పక్కనుండి వెళ్లినప్పటికీ ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించారు రణదీప్ గులేరియా. అందుకే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచిస్తున్నారు. అంతేకాకుండా భౌతిక దూరం పాటించడం కూడా ఎంతో ముఖ్యం అంటూ హెచ్చరిస్తున్నారు ఆయన. ఇక ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో వాడుతున్న మోనోక్లోనల్ మెడిసిన్ కు ఈ వైరస్ లొంగదని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: