ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

praveen
ఏరువాక పౌర్ణమి రైతులకు ఎంతో ప్రత్యేక మైన రోజు. సరిగ్గా వర్షా కాలం పంటలు వేసే ముందు ఏరువాక పౌర్ణమి వస్తూ ఉంటుంది. ఇక ఆ రోజున.. భూ తల్లికి, కాడేడ్లకు పూజలు చేస్తూ ఉంటారు రైతులు. ఇటీవల టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు రాష్ట్ర రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భం గా భూమాతను పూజించి  వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన రైతన్నలు అందరూ సంతోషం గా ఉండాలని ఆకాంక్షించారు. అంతే కాదు ఇక ఈ ఏడాది మంచి పంట ఉత్పత్తులను సాధించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నట్లు తెలిపారు.

 ఇక రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు చంద్ర బాబు నాయుడు. రాష్ట్ర మంత పాడి పంటలు తులతూగుతూ ఇక రైతే రాజు కావాలని కోరు కుంటున్నాను అంటూ చెప్పు కొచ్చారు. ఇక గతం లో తాము అధికారం లో ఉన్న సమయం లో ఏరువాక పౌర్ణమి రాష్ట్ర వ్యాప్తం గా పండుగలా నిర్వహించి రైతులను ఆనంద పరిచాము అంటూ చంద్ర బాబు గుర్తు చేశారు. ఇక రైతాంగం ఇబ్బందులు పడకుండా పంటలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా సకాలం లో అందించి ప్రభుత్వం రైతులందరికీ సహకరించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అంతేకాదు రైతులకు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందించాలని డిమాండ్ చేశారు చంద్ర బాబు నాయుడు.

 రైతుల సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకుని ప్రభుత్వ పథకాలను ప్రవేశ పెట్టాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు చంద్ర బాబు నాయుడు. ఇక కరోనా విపత్తు నేపథ్యం లో అన్నదాత లందరికీ ప్రభుత్వం అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక పంటలు సమృద్ధిగా పండి రైతే రాజు కావాలని ఆకాంక్షించారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: