ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా పౌరుడు ఇండియా లో ఉన్నాడు అని చెప్పడానికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి గా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి కార్యకలాపంలో కూడా ఆధార్ కార్డు కావలసి వస్తుంది. ఇక ప్రస్తుతం ప్రతి మనిషి జీవితం లో కావాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. అందుకే భారత్ లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు కలిగి ఉంటారు. ఆధార్ కార్డు ఉంటేనే అటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా అందుతూ ఉంటాయి.

 అంతే కాదు బ్యాంకు ఖాతా తీసుకోవాలన్న..  ఐటిఆర్ దాఖలు చేయాలి అన్న కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవడానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి గా మారిపోయింది ఒకప్పుడు ఓటర్ ఐడి, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ తీసుకొని సిమ్ ఇచ్చేవారు  కానీ ఇప్పుడు సిమ్ తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి గా మారిపోయింది. సాధారణంగా నేటి రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులు  వాడుతూ ఉంటారు. మరి కొంతమంది 1, 2 కాదు అంతకు మించి అనే రేంజ్ లో ఏకంగా సిమ్ కార్డులు వాడుతూ ఉంటారు.

 అయితే ఒక వ్యక్తి ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డు తీసుకోవచ్చు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే గతంలో ఒక వ్యక్తి పేరు పై కేవలం 9 కార్డులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఈ రూల్ సడలించింది. ఇక ఒక వ్యక్తి పేరు పై 18 సిమ్ కార్డుల వరకూ తీసుకునే వెసులు బాటు కల్పించింది. టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు పై 18 సిమ్ కార్డుల వరకు తీసుకోవచ్చు. కానీ ఇక 18  సిమ్ కార్డులు  విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం 9 కాదు తీసుకుంటే మిగిలిన తొమ్మిది సిమ్ కార్డులు ఎం2ఎం కమ్యూనికేషన్ కోసం తీసుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: