అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే?

praveen
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు ఇప్పటికీ సరైన పరిహారం అందక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇంటి స్థలాలు భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్యాకేజీ కూడా ప్రకటించింది. కానీ ఇప్పటికీ కొంతమంది ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇటీవలే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చూస్తున్నప్పటికీ ప్రభుత్వం అందించే ప్యాకేజీ రాకపోవడంతో మనస్థాపం చెందిన మల్లన్న సాగర్ గ్రామానికి చెందిన బాధితుడు మల్లారెడ్డి ఏకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.



 ఎన్నో రోజుల నుంచి తనకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావడంలేదని మనోవేదనకు గురైన మల్లారెడ్డి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మేఘాల ఘాట్ కు చెందిన మృతుడు ఆత్మహత్య స్థానికంగా విషాదఛాయలు నింపింది  ఎవరికి తెలియకుండా ఇంట్లోనే చితి పేర్చుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని చితిలో దూకేసాడు. అయితే ముంపు బాధితులైన మల్లారెడ్డి ఆత్మహత్యపై  ఇటీవలే షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ స్పందించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.



 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపోవడంతో మనస్థాపం చెందిన మల్ల రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ ఆరోపించారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధించింది అన్నారు ఇందిరా శోభన్  సదరు బాధితుడికి ప్యాకేజీ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఒక ప్రాణం పోయింది అంటూ విమర్శించారు  కన్నతల్లి లాంటి ఊరు విడిచి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కమిషన్ల కోసమే కెసిఆర్ భారీ ప్రాజెక్టులు డిజైన్ చేశారని విమర్శించారు  మల్లారెడ్డి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: