రాష్ట్రపతి ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలిస్తుందా ?

VAMSI
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి రాజకీయంగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పీకే తన వ్యూహాలతో రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకుని ప్రత్యర్ధులను ఓడించడంలో దిట్ట అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో తన రాజకీయ ఎత్తులతో అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ కారణం అయ్యాడన్న విషయము తెలిసిందే. ఇటీవల ముగిసిన తమిళనాడు రియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో డీఎంకే మరియు టీఎంసీ పార్టీలు అధికారాన్ని సాధించడంలో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహలే ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్ దెబ్బకు అధికార బీజేపీ ఆత్మరక్షణలో పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి పేరున్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం మరొక వ్యూహానికి రెఢీ అవుతున్నాడు. 

ఈ సారి ఏకంగా రాష్ట్రపతి ఎన్నికలో తన రాజకీయ చతురతతో విజయాన్ని సాధించేందుకు కార్యాచరణను మొదలెట్టాడని తెలుస్తోంది. ఇది కనుక అనుకున్నట్లు జరిగితే బీజేపీకి గట్టి షాక్ తగలడం పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలో పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి దేశంలోని ప్రతి పక్ష పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇవ్వనున్నారట. ఈ కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా చెందుతున్నాయి. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ అధికార బీజేపీకి పోటీగా సీనియర్ నాయకుడు ఎన్సీపి అధినేత శరద్ పవార్ ను పోటీలోకి దించనున్నట్లు సమాచారం. అయితే బీజేపీ బలపరిచే అభ్యర్థికే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

అయినా ఈ వ్యూహంతో ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్ ను ఎందుకు ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నారో అర్థం కావడం లేదు. అయితే వ్యక్తిగతంగా శరద్ పవార్ గెలుపుపై ఆశలు ఉంటేనే ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ ఇది ప్రశాంత్ కిషోర్ ప్రోద్బలంతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ చివరికి శరద్ పవార్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ గెలుపు దాదాపు తద్యమే అయినప్పటికీ ప్రశాంత్ కిషోర్ ఏమైనా అద్భుతాలు చేయగలడా ? అన్న విషయం చర్చకు వస్తోంది. మరి చూద్దాం ఏమి జరగనుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: