ఆ ఒక్క బిరియాని ఎంత పని చేసింది?

Satvika
ఆ ఒక్క బిరియాని పోలీసుల జీవితానికి దెబ్బ వేసింది.. బిరియాని ఎం చేసింది అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అవును మీరు విన్నది నిజమే.. హత్య కేసులో ఖైదీగా ఉన్న వ్యక్తి కడుపు నింపింది.. డ్యూటీ లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ పొట్ట కొట్టింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది అక్షరాల సత్యం.. వివరాల్లొకి వెళితే.. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుస్టేషన్‌లో బిరియాని తినడం తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయ్యారు.

కాగా, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన గ్రామ అధ్యక్షుడు కావడం, అతడిని విచారణ నిమిత్తం కేసుకు సంబంధం లేని పోలీసుస్టేషన్‌లో ఉంచిన టైం లో అక్కడ అతను బిరియాని తింటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ విచిత్ర సంఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ వెలుగు చూసింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సాయన్న, మరో కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌లను సస్పెండ్‌ చేస్తూ నిజామాబాద్‌ సీసీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు.

మే చివరి వారంలో ఆర్మూర్‌ పీఎస్‌లో జమేదార్‌ సాయన్న, వాచ్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ల నిర్లక్ష్యం కారణంగానే సిదార్ధ అనే యువకుడి హత్య కేసులు ప్రధాన సూత్రదారి రాజేష్‌ బిర్యానీ తింటు, సెల్‌ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పై అధికారులు కానిస్టేబుల్స్ పై వేటు వేశారు. వారిద్దరినీ విధుల నుంచి తొలగించారు. పీఎస్‌లో ఎస్‌హెచ్‌ఓల ఆదేశాలు లేకుండా నేరస్థులకు, ఇతరులకు ఎలాంటి సేవలు అందవు. అంతా స్టేషన్‌ అధికారుల ఆదేశాల మేరకు జరిగినా వారిని వదిలేసి కింద స్థాయిలో ఉన్న కానిస్టేబుల్స్ ను సస్పెండ్‌ చేయడం రాజకీయ చర్చలకు దారి తీసింది.. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: