కస్టమర్లను హెచ్చరించిన ఎల్ఐసి.. అలా చేస్తే శిక్ష తప్పదు అంటూ?
ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తమ వినియోగ దారులకు ప్రజలకు కీలక విషయాన్ని తెలుపుతూ హెచ్చరికలు జారీ చేసింది . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకు చెందిన కంపెనీ లోగో ఎవరు ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎల్ఐసి . కంపెనీ అనుమతి ఉంటేనే ఎల్ఐసి లోగో ఉపయోగించాలని.. ఇక మిగతా ఎవ్వరూ కూడా ఎల్ఐసి లోగో ఉపయోగించకూడదు అంటూ తెలిపింది. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి ఉపయోగిస్తే.. వారు శిక్షార్హులే అంటూ తెలిపింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.
ఏదైనా వెబ్ సైట్ కానీ లేదా ఇతరులు, వ్యాపారులు కూడా ఎల్ఐసి కంపెనీకి సంబంధించిన లోగో ఉపయోగించేందుకు అనుమతి లేదు అంటూ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంస్థ సిద్ధంగా ఉంది అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో అటు ఎల్ఐసి వినియోగదారులందరిని అలర్ట్ చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వినియోగదారుల కు ఫోన్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ కార్డు నెంబర్ లాంటి వివరాలు అస్సలు అడగదని.. ఒకవేళ అపరిచిత నెంబర్ నుంచి కాల్స్ వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి అంటూ సూచించింది.