నేటి నుండే ఆనందయ్య మందు పంపిణీ ? ఇందులో నిజమెంత ?

VAMSI
ప్రస్తుతం దేశంలో ఆనందయ్య కరోనా మందుపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని, కృష్ణపట్నం అనే గ్రామంలో ఆనందయ్య అనే వ్యక్తి కరోనాని నివారించేందుకు తయారు చేసిన ఆయుర్వేదిక్ ఔషదం ఎంతటి పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇది కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొంటోందని , ఈ ఔషధాన్ని తీసుకుంటే కరోనా అస్సలు రాదు అని ప్రజలు చెప్పడమే కాదు. ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయి ఇప్పుడో, కాసేపో చనిపోతారు అంటూ వచ్చిన చాలా మంది రోగులు సైతం ఆనందయ్య తన మందును వేయడమే తడువు లేచి కూర్చుని తిరిగి హాయిగా ఇంటికి వెళ్ళిన సందర్భాలు చోటు చేసుకోవడంతో, ఆనందయ్య మందుకు మరింత డిమాండ్ పెరిగింది.

గత కొద్ది రోజుల క్రితం అనందయ్యను ప్రభుత్వం మందుకు సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి తీసుకెళ్లిన సంగతి తెలియంది కాదు. ఆ తరువాత అనందయ్య మందిపై హై కోర్ట్ లో విచారించిన తరువాత ఒక్క కంటిలో వేసే మందు మినహా, మిగిలిన వాటిని పంపిణీ చేయడానికి అనుమతినిచ్చింది. దీనితో ప్రజలకు మళ్లీ ఊపిరి వచ్చినట్లయింది. అయితే ఆనందయ్య కృష్ణపట్నంకి తిరిగి వచ్చినప్పటి నుండి పలు రకాల ప్రకటనలు చేశారు. మందు పంపిణీ ఇకపై కృష్ణపట్నంలో ఇచ్చేది లేదని, ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. దీనికి గానూ ప్రత్యేక ఆన్లైన్ యాప్ కూడా తయారు చేయబోతున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం నేటి నుండి ఆనందయ్య కరోనా మందును తయారుచేసి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇంకా తయారుచేయడానికి అనుమతులు ఇవ్వలేదని కాబట్టి, ఈ అవాస్తవమైన వార్తలు నమ్మొద్దని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే ఆనందయ్య మందు ఈ రోజు పంపిణీ చేస్తాడా లేదా అన్నది స్పష్టం కాలేదు. దీనిపై ఆనందయ్య ఏమైనా ప్రకటన చేస్తాడా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: