టీఆర్ఎస్ నేతలు సాయం చేస్తేనే 'మీడియా' కవర్ చేస్తుందా..?
ఇలా మానవతా సాయం చేసే వారిలో రాజకీయ పార్టీల నాయకులు కూడా ఉంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, షర్మిల పార్టీ నాయకులు.. ఇలా ఎందరో తమకు తోచిన సాయం చేసుకుంటూ పోతున్నారు. అంతే కాదా.. సేవకు రాజకీయాలతో పనే ముంటుంది. కానీ.. రాజకీయ పార్టీ నాయకుల సాయం కాస్త భిన్నం.. వారు ఏదైనా కాస్త పబ్లిసిటీ కోరుకుంటారు. మీడియా కూడా రాజకీయ పార్టీల నాయకుల సాయాన్ని కాస్త బాగా కవర్ చేస్తుంటుంది.
అయితే ఇప్పుడు తెలంగాణలో కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మీడియాలో ఎక్కువగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న సాయమే కనిపిస్తోంది. అంతకు మించి మిగిలిన పార్టీల నేతలు సాయం చేస్తున్నా అవి సోషల్ మీడియాకే పరిమితం అవతున్నాయి తప్పితే.. మెయిన్ మీడియాలో కవర్ కావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణలో మీడియా ఇప్పుడు క్రమంగా టీఆర్ఎస్ గుప్పిట్లోకి వెళ్లడం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి సొంతగా ఓ పేపర్, ఓ ఛానల్ ఉన్నాయి. దీనికి తోడు టీవీ9 గ్రూపు ఇప్పడు కేసీఆర్ అనుకూలుర చేతుల్లోనే ఉంది. ఇంకా కొన్ని టీవీ ఛానళ్లు.. కేసీఆర్ కు అనుకూలంగానే పని చేస్తాయి.. ఇలా మీడియాలో టీఆర్‌ఎస్ ప్రాబల్యం పెరగడంతో మీడియా కవరేజ్‌లోనూ ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది మరి.