ట్రంప్ అకౌంట్ ను జైల్లో వేసిన ఫేస్ బుక్?

praveen
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన భావజాలాన్ని మొత్తం సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తుంటారు డోనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే కొన్ని కొన్నిసార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు.  అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్యలపై అప్పుడప్పుడు సోషల్ మీడియా సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా  డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు  సోషల్ మీడియా సంస్థల నుంచి ఏకంగా హెచ్చరికలు సైతం ఎదుర్కొన్నారు డోనాల్డ్ ట్రంప్.

 గతంలో సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ అటు ట్విట్టర్ ట్రంప్ కి షాక్ ఇచ్చింది.  కొన్ని రోజుల పాటు ట్రంప్ అకౌంట్ పై ఆంక్షలు సైతం విధించింది. ఇక ఇప్పుడు మరో సారి ఫేస్బుక్ సైతం డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్లపాటు డోనాల్డ్ ట్రాంప్ ఫేస్బుక్ ఖాతా పై నిషేధం విధిస్తూ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.  దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది.  డొనాల్డ్ ట్రంప్ ఖాతా పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపిన ఫేస్బుక్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

 అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టులు వ్యాఖ్యలు పూర్తిగా అల్లర్లకు కారణం అయ్యే విధంగా ఉన్నాయి అంటూ ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. అందుకే ఆయన ఫేస్బుక్ ఖాతా పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాము అంటూ తెలిపింది. ఇక అందుకే డోనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ ఖాతా పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు గా తెలిపింది.  ఈ రెండేళ్ల పాటు డోనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ అకౌంట్ ఫేస్ బుక్ జైలులో ఉంటుంది అంటూ ప్రకటించింది. రెండేళ్ల నిషేధం తర్వాత నిపుణుల కమిటీ భేటీ అయి మళ్లీ ఖాతా తిరిగి యాక్టివేట్ చేయడం పై నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: