షాకింగ్: కరోనా టీకా తీసుకున్న వాళ్లంతా రెండేళ్లలో చనిపోతారా..?

Chakravarthi Kalyan
కరోనా టీకాలపై మొదటి నుంచి జనంలో అనుమానాలు ఉన్నాయి. అందులో మొదట్లో టీకాలు వేస్తాం రండహో అంటూ ప్రచారం చేసినా చాలా మంది ముందుకు రాలేదు. అప్పట్లో కరోనా కేసులు కూడా చాలా వరకూ కంట్రోల్లోకి వచ్చాయి. అందుకే జనం కూడా లైట్ గా తీసుకున్నారు. కానీ.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా జనంలో మళ్లీ పెరిగింది. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉండటంతో జనం టీకాల కోసం క్యూ కడుతున్నారు. కానీ ఇప్పడు దేశాన్ని వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.

అయితే ఇప్పుడు టీకాలపై ఓ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. కరోనా టీకాలు వేయించుకున్న వారంతా రెండేళ్లలో తప్పకుండా మరణిస్తారని ప్రఖ్యాత సైంటిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మాంటెగ్నీర్ చెప్పినట్టు వచ్చిన వార్త కలకలం సృష్టించింది. ఈ సైంటిస్టుకు చాలా పేరుంది. ఎయిడ్స్ వ్యాధి పరిశోధనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి ఇలా చెప్పడంతో టీకా తీసుకున్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

అయితే టీకా తీసుకుని ఈ వార్త చదివిన  వారు కంగారు పడక్కర్లేదు. ఇది ఫేక్‌ న్యూస్‌ గా గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇది ఫేక్‌ న్యూస్ అని..దీన్ని ఎవరకూ ఫార్వార్డ్ చేయవద్దని హెచ్చరించింది. కరోనా టీకాలు పూర్తిగా సురక్షితమైనవని.. ఇలాంటి తప్పుడు వార్తలు చూసి ప్రజలు కంగారుపడాల్సిన అవసరం లేదని పీఐబీ తెలిపింది. సామాజిక మాధ్యమాలు వచ్చాక ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారం చాలా సాధారణం, సులభంగా మారింది.

చాలా మంది తెలిసీ తెలియకుండానే సంచలనంగా కనిపిస్తే చాలు ఫార్వార్డ్ చేసేస్తుంటారు. ఒక్కోసారి అది ప్రమాదకరం కూడా. తెలిసీ తెలియకుండా ఫార్వార్ట్ చేసినా ఒక్కోసారి మనం కూడా చిక్కుల్లో పడతాం. అందుకే సోషల్ మీడియా వార్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పూర్తిగా చెక్ చేసుకున్నాకే ఫార్వార్డ్ చేయండి. అసలు ఇలాంటి భయం కలిగించే వార్తలు ఫార్వార్డ్ చేయకపోవడమే ఉత్తమం.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: