ఆనందయ్యకు అండగా.. మంత్రి అనిల్ కుమర్..?

Chakravarthi Kalyan

కృష్ణపట్నం ఆనందయ్య.. నిన్న మొన్నటి వరకూ ఎక్కడా వినిపించని ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇప్పుడు ఆనందయ్య అంటే తెలియని వారు చాలా తక్కువ. అయితే ఆనందయ్యకు ముందు నుంచి వైసీపీ నేతల సపోర్ట్ ఉంది. సామాన్య ప్రజలకు ఆనందయ్య మందు ఉపయోగపడాలన్న నాయకుల ఆలోచనో.. లేక.. ఆనందయ్య అంశంలోనూ రాజకీయ లబ్ది కోసం చూస్తున్నారో తెలియదు కానీ.. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

తాజాగా ఆనందయ్య మందు తీసుకున్నవారిలో కూడా కొందరు మళ్లీ సీరియస్ అవుతున్నారన్న ప్రచారం ప్రారంభమైంది. ఓ హెడ్ మాస్టర్‌ పరిస్థితి మళ్లీ ఆందోళనగా మారిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయంపై మంత్రి అనిల్ కుమార్ ఆరా తీశారు. రెండ్రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందు వేసుకున్న.. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలు పక్కనబెట్టి ప్రభుత్వానికి సహరించాలని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆనందయ్య మందుపై  ఐసీఎంఆర్‌, ఆయూష్‌ నివేదికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఇప్పటికే కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోందని చెప్పారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి అనిల్‌ పర్యటించారు. అధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు అన్ని విధాలా ముందుకెళ్తున్నామన్నారు. ప్రధాన ఆస్పత్రిలో మరో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటుకు యత్నిస్తున్నామని చెప్పారు. బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ప్రత్యేకంగా 50 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.

మొత్తానికి ఆనందయ్య ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు.. ఇప్పుడు ఎవరి నోట చూసినా ఇదే మాట.. ఆయనకు ఏ రేంజ్‌లో పేరు వచ్చిందంటే.. ఒక రోజు మొత్తం కృష్ణపట్నం అన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇండియా మొత్తం ఇప్పుడు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య గురించి, ఆయన కనిపెట్టిన కరోనా మందు గురించి చర్చించుకుంటున్నారు. ఇదో వండర్ మెడికల్ మిరాకిల్ అంటున్నారు. అనేక జాతీయ పత్రికల్లో ఈ కరోనా మందుపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: