ఆ టీడీపీ ఎమ్మెల్యే జగన్ కంట్లో పడ్డారా...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు అవినీతి చేసే అవకాశం ఉంది అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల విషయంలో నిదానంగా ముందుకు వెళుతోంది. గతంలో వాళ్ళ పై ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి సైలెంట్ గానే ఉన్నా సరే ఇప్పుడు మాత్రం వాళ్ల విషయంలో కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.
కొంతమంది విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారుల ద్వారా జగన్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకుని పెట్టుకున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి అంటే ఈ విధంగానే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఇక త్వరలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే విషయంలో కేసులు నమోదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో నుంచి బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు నాయకుడు విషయంలో ఇప్పుడు జగన్ చాలా సీరియస్ గా ఉన్నారని ఆయన పై కేసులు నమోదు చేయడానికి ఇప్పటికే రెడీ అయ్యారని ఏసీబీ అధికారులకు కూడా జగన్ కొన్ని సూచనలు చేశారని సమాచారం. గతంలో తనపై విమర్శలు చేశారు అనే కారణంతో ఆయన విషయంలో జగన్ సీరియస్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది నాయకుల విషయంలో కూడా జగన్ సీరియస్ గా దృష్టి సారించే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: