కరోనా : వృద్దుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తా?

praveen
దేశాన్ని మొత్తం కరోనా వైరస్ నీడలు కమ్మేస్తున్నాయి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తుంటే దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది.  రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు సగటు మనిషిలో ప్రాణ భయాన్ని  పెంచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కొన్ని కొన్ని సార్లు కరోనా వైరస్ ఎలాంటి దుస్థితిని తీసుకొస్తుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కంటే చివరికి చావడమే మేలు అనే పరిస్థితులు తెస్తుంది. అయినప్పటికీ ఎక్కడ ఎవరు ధైర్యాన్ని కోల్పోవడం లేదు రోజురోజుకు అందరూ ఎంతో ధైర్యంగా కరోనా వైరస్ ను ఎదుర్కొంటున్నారు.

 ప్రస్తుతం భారత ప్రజల ధైర్యాన్ని చూసి అటు కరోనా వైరస్ భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకపోతే ఈ మహమ్మారి వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు మొదటి రకం  వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ లక్షణాలు కూడా ఎంతో డిఫరెంట్ గా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మందికి ఈ వైరస్ లక్షణాలు విషయంలో అయోమయంలో పడిపోతున్నారు ముఖ్యంగా వృద్ధుల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతుండగా వృద్ధులలో వైరస్ లక్షణాలు కూడా ఎంతో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో వృద్ధుల్లో సరికొత్త లక్షణాలు బయటపడినట్లు తెలిపారు.

 ముఖం పెదవులు గోళ్లు లాంటివి నీలి రంగు లోకి మారాయి అంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో ఉత్తమం అని సూచిస్తున్నారు.  ఇవి కూడా  వైరస్ లక్షణాలు అని చెబుతున్నారు. ఛాతిలో నొప్పిగా అనిపించడం అంతేకాకుండా ఆయాసం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు లాంటి లక్షణాలు ఉన్న అప్రమత్తం కావాలి అంటున్నారు. దగ్గు ఎక్కువ కావడం అలసట ఎక్కువ లాంటివి కూడా కరోనా వైరస్ లక్షణాలేనని.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించడం ఎంతో ఉత్తమం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: