
హెచ్డీఎఫ్సి కస్టమర్లకు హెచ్చరిక.. ఆ సేవలు బంద్?
ఇక ఇటీవలే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ కస్టమర్లను అలర్ట్ చేసింది. రేపు కొన్ని గంటల పాటు కొన్ని రకాల సేవలకు అంతరాయం ఏర్పడుతుంది అంటూ కస్టమర్లకు తెలిపింది హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్. బ్యాంక్ ఆన్లైన్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటు లో ఉండవని అందుకే ఈ విషయాన్ని అందరూ కస్టమర్లు గమనించాలి అంటూ సూచించింది. షెడ్యూల్ మెయింటెనెన్స్ కారణం గా మే 8వ తేదీన ఉదయం 2:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొన్ని సేవలకు అంత రాయం కలుగుతుంది అంటూ హెచ్డిఎఫ్సి తెలిపింది.
హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ సహా మొబైల్ బ్యాంకింగ్ సేవలు కూడా పనిచేయవు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక ఈ విషయాన్ని తమ కస్టమర్లు గుర్తుంచు కోవాలని సేవలకు అంతరాయం కలిగినందుకు క్షమించాలి అంటూ హెచ్డిఎఫ్సి కోరింది. ఇక మే 8వ తేదీన సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని రకాల సేవలు యధాతధంగా పనిచేస్తాయని కస్టమర్లందరూ కూడా సేవలు నిరంతరాయం గా పొందేందుకు అవకాశం ఉంటుంది అంటు హెచ్డిఎఫ్సి స్పష్టం చేసింది. ఏదేమైనా ఇక కొన్ని గంటల పాటు నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండకపోతే కస్టమర్లు ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.