జగనోరి ప్రభుత్వ అరెస్టులు పెరగనున్నాయా ?

Satvika
ఏపి లోకి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో ఈ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలా ఎవరికీ వారే అన్నట్లు ప్రచారం చేస్తారు. అందులో భాగంగా నోటికి వచ్చిన ప్రగాల్బాలు పలుకుతారు.. దాని ప్రతి ఫలంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ వన్ మ్యాన్ షో గా సాగుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అగ్ర రాజ్యంగా కొనసాగుతుంది. ప్రతి ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగురేశారు..

ఇది ఇలా ఉండగా.. వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి పక్ష నేతల అరెస్ట్ జరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పనికి వైసీపీ బదులు తీర్చుకుం టుందేమో అనే సందేహాలు జనానికి కలుగుతున్నాయి. టీడీపీ నేతల అరెస్ట్ అనేది జరుగుతూనే ఉంది. రవీంద్రన్ దగ్గరి నుంచి నిన్న జరిగిన వర్ల రామయ్య వరకు ఎక్కడో చోట టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఆ పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తప్పలేదు.

కాగా, ఇప్పుడు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ కువంతు వచ్చింది.  పది , ఇంటర్ పరీక్షలను ఏపి ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు లోకేశ్ మెడకు చుట్టుకోనున్నాయని ఎంపీ విజయ సాయిరెడ్డి  వ్యాఖ్యలు చెప్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వైసిపి నాయకులు నారా లోకేష్ చదువుపై, పరీక్షలు లోకేష్ రాయలేదని, డిగ్రీలు కొనడానికి ఫీజులు స్పాన్సర్స్ తో కట్టించారని పలుమార్లు విమర్శించారు. ఇక దీని పై మండిపడిన టీడీపీ నేత వర్ల రామయ్య విజయసాయి రెడ్డి పై రివర్స్ ఎటాక్ చేశారు.. అంటుకట్టుట కేసులలో పసుపు పురుషులను మరింతగా అరెస్టు చేస్తారని, నారా లోకేశ్ ప్రసంగ రచయితలు నిరసన మరియు విమర్శలకు ప్రకటనలు సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నారు. ‘పొలిటికల్ వెండెట్టా’ వంటి పదబంధాలను ఉపయోగించడం ద్వారా అతన్ని మొసలి కన్నీళ్లు పెట్టడం తప్ప, వారు ఇంకేమీ చేయలేరు.. అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: