కని కరోనా: ఇలాంటి పరిస్థితుల్లో ఆగని బ్లాక్ మార్కెట్ దందా..
ఒక్కో బాధితుడికి ఈ డోసు ఆరు సార్లు ఇవ్వాల్సి వస్తుంది.బ్లాక్ లో ఆరు డోసు లు కొనాలంటే లక్ష కు పైగా ఉంటుంది..ఇది సామాన్యుడికి మాత్రం మోయలేని భారం.. ఇది కేవలం బడాబాబుల హస్తగతం అయ్యింది. డబ్బులు ఉన్న వాళ్ళ ప్రాణాలే విలువైనవి అన్నట్లు ఇప్పుడు మార్కెట్ దందా జోరుగా సాగుతోంది.రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఇప్పటికే బ్లాక్ చేసిన అక్రమార్కులు, బాధితుల అవసరాన్ని బట్టి విపరీతమైన ధరలు పెంచి విక్రయిస్తున్నారు.
రెమ్‌డెసివిర్ అసలు ధర దాదాపు 3,000 రూపాయలు గా ఉంటే, దానికి పది రెట్లు పెంచి 30 వేల రూపాయలకు విక్రయిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ అవుతుంది. బ్లాక్ మార్కెట్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణకు, ఆసుపత్రుల దోపిడీకి నిదర్శనంగా మారుతున్నాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ తమ వారి ప్రాణాలు నిలిపేందుకు బ్లాక్ మార్కెట్ లో అడిగినంత చెల్లించి ఇంజక్షన్ లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ప్రాణాలను కాపాడే ఈ వ్యాక్సిన్ బ్లాక్ దందాను ఆపాలని ప్రభుత్వాలు ఎంతగగా ప్రయత్నించిన కూడా అవి బూడిదలో పోసిన పన్నీరు గా మారుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మున్ముందు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి...