మళ్లీ పడిపోయిన చికెన్ ధరలు.. రేపు ధరలు ఇలా..

Satvika
జనాలు ఎలా ఉన్నారంటే ఏదైనా ఒకవార్త సంచలనం అయితే, దానిని గుడ్డిగా నమ్మేస్తారు. ఆ విషయం గురించి ఎంత వాదించినా అస్సలు నమ్మరు.. వారి మొదటగా ఫిక్స్ అయ్యిందే ఫైనల్ చేస్తారు. ఇక విషయానికొస్తే.. కరోనా ప్రభావం మొదలైన మొదట్లో చికెన్ ను లేదా గుడ్లను తింటే కరోనా వస్తుందని ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. దీంతో చికెన్ మాట కూడా వినపడలేదు. తర్వాత ప్రభుత్వాలు చికెన్ తింటే కరోనా రాదని అంటే తేల్చి చెప్పడం తో చికెన్ తినే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దాంతో పాటుగా ధరలు కూడా పైకి కదిలాయి.  

ఇదే అదునుగా వ్యాపారులు బిజినెస్ లో జోరును పెంచారు. మార్కెట్ లో ఉన్న ప్రైజ్ కన్నా ఎక్కువ వసూల్ చేశారు. అయిన జనాలు తింటూ వచ్చారు. ఇకపోతే ఇప్పుడు మళ్లీ చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.కిలోకి రూ.70-80దాకా తగ్గింది. గత వారం బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220కి అమ్మగా, ప్రస్తుతం రూ.140 నుంచి రూ.150కే అమ్ముతున్నారు. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది. వేసవి కారణంగా 30% దాకా వినియోగం తగ్గడంతో చికెన్‌ రేట్లఉ తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.

చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. హోల్‌సేల్‌గా 100గుడ్లకు రూ.50 నుంచి రూ.65దాకా తగ్గింది.రిటైల్‌గా గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు. కాగా, ఓవైపు వేసవి ఎండలకు పౌల్ర్టీ ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవుతుండగా, ఉన్నవాటిని దుకాణాలకు తరలిస్తున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో కూలీలు రాకపోవడంతో పౌల్ర్టీలు మూతపడుతున్నాయి. ఈ పరిణామాల కారణంగానే చికెన్‌ ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. మరి ప్రభుత్వాలు ఈ విషయం పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తి గా మారింది. రేపు ధరలు కూడా 60-70 కొనసాగుతున్నాయి.. కరోనా వల్ల ఇంకెన్ని నష్టాలను చూడాలో అని మిగిలిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: