సాగర్ ఉప ఎన్నిక: అలాంటివారు ఇప్పుడే ఓటేయడానికి వీల్లేదు...?

VAMSI
తెలంగాణాలో ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ రోజు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాజకీయ నాయకులంతా అక్కడే తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. దొరికిన ఏ ఒక అవకాశాన్ని వదలకుండా ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారో తెలిసే సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికలో గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంది తెరాస అభ్యర్థి కావడం వలన వీరికి సానుకూలముగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ అంత ఈజీగా గెలుపు దక్కే అవకాశం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనము దుబ్బాక ఉప ఎన్నిక చూశాము.

అక్కడ తెరాసదే గెలుపు అని అంతా అనుకున్నారు. కానీ ఉత్కంఠగా జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపు బావుటా ఎగురవేశారు. కాబట్టి ఎవరినీ అంత తక్కువ అంచనా వేయకూడదని తెలుస్తోంది. కాగా పోలింగు శాతం మందకొడిగా సాగుతోంది. పోలింగు జరిగే కొద్దీ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానానికి బరిలో ఉన్న అభ్యర్థులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇదంతా ఇలా ఉండగా, ఇప్పుడు కరోనా ఉధృతి పెరుగుతున్న సమయంలో....నాగార్జునసాగర్ నియిజకవర్గ పరిధిలో కూడా కరోనా సోకిన ఓటర్లు ఉన్నారు. వీరిని మాత్రం అందరితో పాటుగా ఓటు వేయడానికి ఎలక్షన్ అధికారులు అనుమతించలేదు.

 ప్రత్యేకంగా సాయంత్రం 6  గంటల తరువాత వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. వీరి ఓట్లు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సమయానికి పోలయిన ఓటింగు శాతం మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మరియు ఓటు వేసి వచ్చిన వారు కూడా వీరిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం..ఏమి జరగనుందో..నాగార్జునసాగర్ అభివృద్ధికి ప్రజలు ఎవరిని ఎనుకోనున్నారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: